ఓ వృద్ధుడి అంత్యక్రియలు పూర్తయ్యాక తాను బతికే ఉన్నానంటూ స్నేహితుడికి కాల్ చేసిన ఘటన మహారాష్ట్రలో జరిగింది. పాల్ఘర్ జిల్లాలో రిఫీక్ షేక్ (60) అనే వృద్ధుడు తప్పిపోగా, కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. జనవరి 29న ఓ వ్యక్తి రైలు ఢీకొని మృతి చెందగా మృతదేహం రిఫీక్ దే అని చెప్పిన కుటుంబ సభ్యులు ఖననం చేశారు. తాజాగా రిఫీక్, స్నేహితుడికి కాల్ చేయగా ఆశ్చర్యంతో పోలీసులకు తెలిపారు. దీనిపై విచారణ చేస్తున్నారు.