‘‘కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అదానీకి అప్పనంగా దోచిపెడుతున్నాయి. అన్ని విధాలుగా ఆయనకు సహకరిస్తున్నాయి’’ అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ధ్వజమెత్తారు. అదానీ అవినీతిపై తక్షణమే క్రిమినల్ కేసులు పెట్టాలని, జాతికి నరేంద్రమోదీ క్షమాపణలు చెప్పాలి డిమాండ్ చేశారు. స్థానిక దాసరి భవన్‌లో ఆదివారం ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో ఆయన మాట్లాడారు. కేంద్ర బడ్జెట్‌లో కేవలం సంపన్న వర్గాలకే పెద్దపీట వేయడాన్ని నిరసిస్తూ ఈ నెల 10న రాష్ట్ర వ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల ఎదుట సీపీఐ ఆధ్వర్యంలో నిరసనలు చేపట్టనున్నట్టు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా కట్టిన వేలాది టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 6న తలపెట్టిన నిరసనలో పెద్దఎత్తున పాల్గొనాలని పార్టీ శ్రేణులు, లబ్ధిదారులను రామకృష్ణ కోరారు.