బీహార్ నలందలో వేడుకల సందర్భంగా జరిపిన కాల్పుల్లో ఏడాది చిన్నారి మృతి చెందింది. నలందలో పుట్టినరోజు వేడుకల సందర్భంగా ప్రమాదవశాత్తూ ఏడాదిన్నర చిన్నారి మృతి చెందిందని నూర్సరాయ్ పోలీసులు మంగళవారం తెలిపారు.ఈ ఘటన దహపర్ ఓపీ పోలీస్ స్టేషన్ పరిధిలోని పర్మానంద్ బిఘా గ్రామంలో చోటుచేసుకుంది. నరేష్ యాదవ్ మునిమనవరాలు బర్త్‌డే పార్టీలో సుజిత్, అజిత్, మంటూ, నరేష్ యాదవ్.. శివపాల్ యాదవ్ మరియు తుంటున్ మహతో తమ చేతుల్లో పిస్టల్స్‌తో డీజే పాటలకు డ్యాన్స్ చేయడం ప్రారంభించారు. నిందితులు మద్యం సేవించి, చేతుల్లో ఆయుధాలతో డ్యాన్స్ చేస్తున్నారు, అందరూ నిరాకరించినప్పటికీ, ఈ వ్యక్తులు సుమారు 15 రౌండ్లు కాల్పులు జరిపారు.దీంతో చిన్నారి అక్కడికక్కడే మృతి చెందింది.