నిన్న మొన్నటి వరకు రూ.30-40 పలికిన టమోటా ధర అమాంతం తగ్గిపోయింది. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మార్కెట్లో కిలో టమోట రూపాయికి దిగజారింది. బహిరంగ మార్కెట్లో కిలో రూ.15, రూ.20 పలుకుతుంటే.. రైతులకు మాత్రం ఒక్కరూపాయి కూడా దొరకడం కష్టంగా మారింది. దీంతో టమోటా రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. టమోటాలు కొనుగోలు చేసి రైతుబజార్ల ద్వారా అందించాలని, తమకు ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.