గుంటూరు: జిల్లాల్లోని న్యాయస్థానాలలో ఈనెల 11న జరగనున్న జాతీయ మెగా లోక్ అదాలత్ ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. జాతీయ, రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థల భాగస్వామ్యంతో అదాలత్ జరగనుందని అన్నారు. జిల్లాలోని కక్షిదారుల కు జాతీయ మెగా లోక్ అదాలత్ పై అవగాహన కల్పించాలని సబ్ డివిజన్ల డీఎస్పీలు, సీఐలను ఆదేశించారు. ఇరుపక్షాలవారికి కౌన్సిలింగ్ నిర్వహించి, ఎక్కువ కేసులు పరిష్కారమయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. జిల్లాలోని కక్షి దారులు లోక్ అదాలత్ లో కేసులను పరిష్కరించుకోవాలని కోరారు.