నేడు దేశీయ స్టాక్ మార్కెట్లు మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 378 పాయింట్లు లాభపడి 60,664 వద్ద ముగిసింది. నిఫ్టీ 150 పాయింట్లు పెరిగి 17,872 వద్దకు చేరుకుంది. ఐటీ, హెల్త్‌కేర్, టెక్, మెటల్, కన్స్యూమర్ డ్యూరబుల్స్ సూచీలు మార్కెట్లను నడిపించాయి.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్లు : బజాజ్ ఫైనాన్స్ (3.14%), అల్ట్రాటెక్ సిమెంట్ (2.47%), రిలయన్స్ (1.99%), ఇన్ఫోసిస్ (1.75%), విప్రో (1.57%).
టాప్ లూజర్స్ : ఎల్ అండ్ టీ (-1.62%), భారతీ ఎయిర్టెల్ (-1.31%), యాక్సిస్ బ్యాంక్ (-0.78%), కోటక్ బ్యాంక్ (-0.59%), హిందుస్థాన్ యూనిలీవర్ (-0.58%).