మొబైల్ స్నాచింగ్ నిందితుడిని పట్టుకుని మృతిచెందిన ఏసీ శంబు దయాళ్ మీనా కుటుంబాన్ని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ బుధవారం పరామర్శించి, కోటి రూపాయల చెక్కును అందజేశారు.దివంగత శంభు దయాళ్ తండ్రి మతాదిన్ మీనా, ఆయన భార్య సంజన, ముగ్గురు పిల్లలను ఆయన కలుసుకుని వారిని ఓదార్చారు.ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ మంత్రి కైలాష్ గహ్లోత్, స్థానిక ఎమ్మెల్యే భావన గౌర్ కూడా పాల్గొన్నారు.దివంగత శంభు దయాళ్ మీనాకు భార్య సంజన మరియు ముగ్గురు పిల్లలు గాయత్రి, దీపక్ మరియు ప్రియాంక ఉన్నారు. దివంగత శంభు దయాళ్ మీనా భార్య సంజనకు రూ.60 లక్షలు, ఆయన తండ్రి మతాదిన్ మీనాకు రూ.40 లక్షల చెక్కును సీఎం కేజ్రీవాల్ అందజేశారు.