మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే)కి చేదు అనుభవం ఎదురైంది. ఉండవల్లి అంబేద్కర్ నగర్‌లోని మంచినీటి పైపులైన్‌ను పరిశీలించేందుకు ఆయన వచ్చారు. ఆ సమయంలో అక్కడ కొంతమంది గుమిగూడారు. వాళ్లంతా తన కోసమే వచ్చారని భావించి ఆర్కే వాళ్ల ముందు కారు ఆపాడు. అయితే అనూహ్యంగా ఆర్కేకి వ్యతిరేకంగా వారంతా నినాదాలు చేశారు. అమరావతి నుంచి రాజధాని తరలింపుపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.దీంతో వెంటనే తన వాహనం ఎక్కి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. స్థానిక మహిళలు కూడా ఆర్కేపై ఆగ్రహం వ్యక్తం చేశారు.