శ్రీ సత్య సాయి జిల్లా హిందూపురం శాసనసభ్యులు నందమూరి బాలకృష్ణ ఆదేశాల మేరకు యువగళం పాదయాత్రలో వాణిజ్య విభాగం రాష్ట్ర అధ్యక్షులు డుండి రాకేష్ పై పోలీసులు చేయి చేసుకోవడం ఖండిస్తూ హిందూపురం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నాయకుల ఆధ్వర్యంలో శుక్రవారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ చేపడుతున్నటువంటి యువగళం పాదయాత్రను చూసి, పాదయాత్రకు వస్తున్న స్పందన చూసి వైసిపి నాయకుల్లో భయం మొదలైందని, రాష్ట్రంలో ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఎక్కడ చూసినా అరాచక పాలన కొనసాగుతుందని, యువగళం పాదయాత్రలో పాల్గొంటున్నటువంటి నాయకులు పైన టిడిపి కార్యకర్తల పైన వీరు చేస్తున్న దౌర్జన్యానికి పాల్పడడం సరైన చర్య కాదని, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గా ఉన్నప్పుడు ఆయన తలుచుకొని ఉండుంటే గతంలో వీళ్ళు పాదయాత్ర చేసేవారా అని మండిపడ్డారు. యువగళం పాదయాత్రను సహకరిస్తే పాదయాత్రగా వెళతాం లేదా దండయాత్రగా వెళ్తామని వెల్లడించారు.ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.