వైసిపి నిరంకుశ పాలన పట్ల విసుగు చెందిన ప్రజలు తెలుగుదేశం పార్టీ వైపు ఆకర్షితులవుతున్నారని రేపల్లె శాసనసభ్యులు అనగాని సత్య ప్రసాద్ తెలిపారు. నిజాంపట్నం మండలం కొత్తపాలెం పంచాయతీలోని సంజీవ నగర్ గ్రామానికి చెందిన 10 కుటుంబాలు శుక్రవారం ఎమ్మెల్యే సత్యప్రసాద్ ఆధ్వర్యంలో టిడిపిలో చేరారు. వీరికి ఎమ్మెల్యే సత్యప్రసాద్ పార్టీ కండువా కప్పి సాధారణంగా తెలుగుదేశంలోకి ఆహ్వానించారు. టిడిపి నాయకులు పంతాని మురళీధర్ రావు, దండుప్రోలు వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో చేరికలు జరిగాయి.