ట్రెండింగ్
Epaper    English    தமிழ்

‘చేయిచేయి కలుపుదాం-రాహుల్‌గాంధీ నాయకత్వాన్ని బలపరుద్దాం’

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Feb 11, 2023, 11:59 AM

రాష్ట్రాన్ని అప్పులపాలు చేసిన ఘనత ముఖ్యమంత్రి జగన్‌కే దక్కుతుందని ఏపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జంగా గౌతమ్‌ ఆరోపించారు. జగన్‌కు మరోసారి అవకాశమిస్తే రాష్ట్రాన్ని అమ్మకానికి పెడతారని హెచ్చరించారు. డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ కోనసీమ జిల్లా కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షుడిగా ఇటీవల నియమితులైన కామన ప్రభాకరరావు ప్రమాణస్వీకారోత్సవాన్ని శుక్రవారం అమలా పురం ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించారు. తొలుత అమలాపురం గడియార స్తంభం సెంటర్‌ నుంచి జిల్లా కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వ ర్యంలో ‘చేయిచేయి కలుపుదాం-రాహుల్‌గాంధీ నాయకత్వాన్ని బలపరుద్దాం’ అంటూ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ప్రెస్‌ క్లబ్‌లో జరిగిన సమావేశంలో జంగా గౌతమ్‌, మరో వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ సుంకర పద్మశ్రీ దేశ , రాష్ట్ర రాజకీయ పాలకుల తీరుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వా లపై కాంగ్రెస్‌ ప్రచురించిన చార్జిషీట్లను పట్టణ వీధుల్లో పంపిణీ చేశారు. అనంతరం జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షునిగా కామన ప్రభాకరరావుతో గౌతమ్‌ ప్రమాణం చేయించారు. కార్యక్రమంలో ఏపీసీసీ కో-ఆర్డినేటర్లు నులుకుర్తి వెంకటేశ్వ రరావు, అంకే సీతారామ్‌, నియోజకవర్గ ఇన్‌చార్జి అయితా బత్తుల సుభాషిణి, ముషిణి రామకృష్ణారావు, వంటెద్దు బాబి, కుడుపూడి శ్రీనివాస్‌, షకీలా తదితరులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com