ప్రేమించి పెళ్లి చేసుకుంటానని నమ్మించి శారీరకంగా అనుభవించి పెళ్లికి మొహం చాటేసిన వ్యక్తిపై నేరారోపణ రుజువుకావడంతో జిల్లా పోక్సో స్పెషల్ కోర్టు పదేళ్ల జైలు శిక్షతోపాటు రూ.2 వేల జరిమానా విధించినట్టు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఎస్పీ సీహెచ్ సుధీర్‌కుమార్‌రెడ్డి శుక్రవారం రాత్రి ఒక ప్రకటనలో తెలిపారు. మండపేట సమీపంలో ఉన్న ఒక ట్రాన్స్‌పోర్టు ఆఫీసులో కంప్యూటర్ ఆపరేటర్‌గా పనిచేస్తు న్న బాధితురాలిని అదే కార్యాలయంలో మేనేజర్‌గా పనిచేస్తున్న శివకుమార్ పలు పర్యాయాలు శారీరకంగా అనుభవించాడు. పెళ్లి చేసుకోనని చెప్పడంతో బాధితురాలి తల్లి 2016 నవంబరు 23న మండపేట రూరల్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. అప్పటి ఎస్‌ఐ సీహెచ్ విద్యాసాగర్ కేసు నమోదుచేయగా రామచంద్రపురం డీఎస్పీ ఎన్‌బీఎం మురళీకృష్ణ దర్యాప్తు చేపట్టి కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు. జిల్లా పోక్సో కోర్టు స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పితాని శ్రీనివాస రావు ప్రాసిక్యూషన్ తరపున బలమైన వాదనలు వినిపించారు. వాద ప్రతివాదనల అనంతరం శుక్రవారం పోక్సో స్పెషల్ కోర్టు జడ్జి ఎల్. వెంకటేశ్వరరావు నిందితుడిపై నేరం రుజువుకావడంతో పైవిధంగా తీర్పునిచ్చారు. సమగ్ర దర్యాప్తు చేసిన అధికారిని, పబ్లిక్ ప్రాసిక్యూట ర్‌ను జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. మహిళలు, చిన్నారు లపై వేధింపులకు పాల్పడితే కఠిన శిక్షలు తప్పవని హెచ్చరించారు.