ఆశ్రమ పాఠశాలలో గిరిజన విద్యార్థిని మృతి చెందింది. తూర్పు గోదావరి జిల్లా పరిధిలోని ముషిణిగుంట గిరిజన ఆశ్రమ పాఠశాలలో కానేం ఈశ్వరిదేవి (15) అనే విద్యార్థిని అనారోగ్యంతో మృతి చెందింది. పదోతరగతి చదువుతున్న ఈ విద్యార్థినికి గత కొన్ని రోజుల నుంచి అనారోగ్యంతో బాధపడుతుండగా గత బుధవారం బాలికను ఇందుకూరుపేట పీహెచ్సీకి తీసుకెళ్లారు. వైద్యులు పరీక్షించి టైఫాయిడ్ జ్వరమని, మందులు ఇచ్చి పంపేశారు. బాలిక ఆరోగ్యం క్షీణించడంతో రంపచోడవరం ఏరియా ఆసుపత్రికి తరలించగా, రక్తకణాలు క్షీణించాయని మెరుగైన వైద్యంకోసం కాకినాడ తరలించగా చికిత్స పొందుతూ శుక్రవారం తెల్లవారుజామున మరణించింది. ఉపాధ్యాయులు విద్యార్థిని పట్ల నిర్లక్ష్యం వహించడం వల్ల సకాలంలో వైద్యం అందక తమ బిడ్డ చనిపోయిందని తల్లిదండ్రులు ఆరోపించారు. ఈశ్వరీదేవి మృతితో గ్రామంలో విషాదం నెలకొంది.