మదనపల్లెలో శుక్రవారం నిర్వహించిన మెగా జాబ్‌వేళాకు నిరుద్యోగుల నుంచి అనూహ్య స్పందన లభించింది. జాబ్‌మేళాలో మదనపల్లె, తంబళ్లపల్లె, పీలేరు, పుంగనూరు, రాయచోటి, రాజంపేట, కదిరి అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి పెద్దసంఖ్యలో విద్యార్థులు, నిరుద్యోగులు హాజరయ్యారు. స్థానిక బీటీ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన జాబ్‌మేళాలో 90 కంపెనీలు పాల్గొన్నాయి. ఇందులో పదో తరగతి నుంచి పీజీ వరకు విద్యార్హత గల నిరుద్యోగులు మొత్తం 9,257 మంది హాజరు కాగా, వీరిలో అర్హతను బట్టి 3,047 మందికి ఉద్యోగాలు లభించాయి. ఉదయం 9గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకూ ఇంటర్వూలు జరిగాయి. అనంతరం ఎంపికైన విద్యార్థులకు ఆయా కంపెనీల ప్రతినిధులు నియామక పత్రాలు అందజేశారు. వీరికి ఉద్యోగాన్ని బట్టి వేతనం రూ.20వేల నుంచి రూ.40వేలు ఇవ్వనున్నట్లు కంపెనీలు ప్రకటించాయి. హైదరాబాద్, బెంగళూరు, తిరుపతి, న్యూఢిల్లీల నుంచి వచ్చిన కంపెనీ ప్రతినిధులు ఇంటర్వూలు నిర్వహించారు. కార్యక్రమంలో క్యూస్‌కార్స్ లిమిటెడ్ చీఫ్ ఆపరేషన అధికారి జాకబ్ మథ్యూస్, జీఎం వెంకటేశమూర్తి, సీనియర్ మేనేజర్ బినోద్‌కుమార్, హరిహర ప్రసాద్, శంతన, వివిధ కంపెనీల యాజమాన్యాలు, హెచఆర్ ప్రతినిధులు పాల్గొన్నారు.