అమూల్ సంస్థ పాలరైతులకు శుభవార్త తెలిపింది. పాల సేకరణ ధరను పెంచినట్లు ప్రకటించింది. లీటర్ గేదె పాలపై గరిష్టంగా రూ.3.30, ఆవు పాలపై గరిష్టంగా రూ.3.08 పెంచింది. కిలో వెన్నపై రూ.30, ఇతర పాల సంబంధిత ఘన పదార్థాలపై రూ.22 మేర ధర పెంచింది. రాయలసీమ, కోస్తాంధ్ర పరిధిలో నేటి నుండి పెంచిన ధరలు అమలులోకి వస్తాయని అమూల్ సంస్థ ప్రకటించింది.