రాజపేట మండలం రఘునాథపురం గ్రామానికి, ఎన్ఆర్ఈజీఎస్ నిధుల ద్వారా మెయిన్ రోడ్, సైడ్ డ్రైనేజీ గాను రూ. 55 లక్షలు, అంగడి బజార్ నుండి కురుమ సంఘం వరకు డబుల్ సిసి రోడ్డు కోసం 25 లక్షల రూపాయలు మొత్తం గ్రామానికి 80 లక్షల రూపాయలు మంజూరు చేసిన ఆలేరు శాసనసభ్యులు, ప్రభుత్వ విప్ గొంగిడి సునీత మహేందర్ రెడ్డి కి, ఉమ్మడి నల్గొండ జిల్లా డిసిసిబి చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి కి మన గ్రామం తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తు, శుక్రవారం వారి చిత్రపటానికి పాలాభిషేకం కార్యక్రమం జరిగింది. అంతేకాకుండా వారు మాట్లాడుతూ ఇంత పెద్ద మొత్తంలో నిధుల మంజూరుకు సహకరించిన ఎమ్మెల్యే కి గ్రామ ప్రజలు ఎల్లవేళలా రుణపడి ఉంటారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రఘునాథపురం గ్రామ సర్పంచ్ గాడి పెళ్లి శ్రావణ్ కుమార్, రాజపేట మండల పార్టీ యువజన అధ్యక్షులు పల్లె సంతోష్ గౌడ్, గ్రామ ఉపసర్పంచ్ పల్లె ప్రవీణ్ కుమార్ గౌడ్, గ్రామ శాఖ అధ్యక్షుడు కొండం రాజు, మండల కోశాధికారిక కటకం స్వామి, సీనియర్ నాయకులు కటకం వెంకటేశం, లోక శ్రీశైలం, బింగి బాలరాజు, నల్ల అశోక్, చెన్న నరసింహారావు, కటకం చిన్న వెంకటేష్, మాజీ సర్పంచులు గుర్రం సిద్ధి రాములు, రామిండ్ల నరేందర్, మాజీ ఎంపిటిసి బింగి అశోక్, మాజీ గ్రామ శాఖ భోగరాజు, గ్రామ వార్డు మెంబర్లు బింగి పాండు, కటకం పెంటమ్మ, బల్ల మురళి, బత్తెము పెద్దలు, సిద్ధిరాములు, బొమ్మ నరేష్, పులి నవీన్, కటకం హరినాథ్, బింగి నరేందర్, ఆడెపు బాబు, బింగి గణేష్, కటకం పాండు, టిఆర్ఎస్ యువజన నాయకులు డొంకెన మహేందర్, మిట్ట కార్తీక్, పిట్టల వెంకటేష్, మార్క శివ, కటకం పృథ్వీరాజ్, నల్ల సాయి తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.