విజయగరం జవహర్లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ (జేఎన్టీయూ) వైస్ చాన్సలర్‌గా ఆచార్య కె.వెంకట సుబ్బయ్య శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.... యూనివర్సిటీ అభివృద్ధికి నిరంతరం కృషిచేస్తానని చెప్పారు. అందరి సహకారంతో ప్రగతిపథంలో యూనివర్సిటీని నడిపిస్తామని చెప్పారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు ప్రయత్నిస్తామని తెలిపారు. ఇప్పటివరకూ వెంకటసుబ్బయ్య ఆంధ్ర యూనివర్సిటీ మెకానికల్ ఇంజినీరింగ్ విభాగంలో సీనియర్ ప్రొఫెసర్‌గా పనిచేస్తూ పదోన్నతిపై వచ్చారు. రిజిస్ట్రార్ స్వామినాయుడు బాబు, రాజ్యలక్ష్మి తదితరులు శుభాకాంక్షలు తెలిపారు.