ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సహకరించాలని అన్ని రాజకీయ పక్షాలకు విజయనగరం జిల్లా, కలెక్టర్ సూర్యకుమారి విజ్ఞప్తి చేశారు. శుక్రవారం రాజకీయ పార్టీల నేతలతో సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ 72 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటుచేస్తున్నట్టు తెలిపారు. కొన్ని పోలింగ్ స్టేషన్ల పరిధిలో ఓటర్ల సంఖ్య 1400 కంటే ఎక్కువగా ఉంటడం వల్ల.. అదనంగా 8 కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. గత ఎన్నికల్లో 64 కేంద్రాలు ఉండగా, ఈ ఎన్నికలకు పోలింగ్ కేంద్రాల సంఖ్య 72కు చేరిందని చెప్పారు రాజాంలో 1, బొబ్బిలిలో 2, విజయనగరంలో 2, ఎస్.కోటలో 2, ఎల్.కోటలో 1 చొప్పన కేంద్రాల సంఖ్య పెంచినట్టు చెప్పారు. జిల్లాలో ఎన్నికల కోడ్ ఉన్నందున అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలని కోరారు.