రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనని మాజీ ఎమ్మెల్సీ జగదీష్, మాజీ ఎమ్మెల్యే బొబ్బిలి చిరంజీవులు అన్నారు. శుక్రవారం ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రత్యేక హోదాతో పాటు ఇతరత్రా సమస్యలపై చర్చించారు. విభజన హామీలు అమలు చేయాలని, రైల్వే జోన్ మంజూరు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర సర్కారుపై ఒత్తిడి తేవాలన్నారు. ప్రత్యేక హోదా తెస్తామని అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రజలను మోసం చేసిందని ఆరోపించారు. ఇప్పటికైనా ఆ పార్టీ ఎంపీలు కేంద్రాన్ని ప్రశ్నించాలన్నారు. కార్యక్రమంలో సీపీఎం, జనసేన, వివిధ ప్రజా సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.