యూపీలోని హమీర్ పూర్ లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. సుమేర్ పూర్ పరిధిలోని నారాయణపూర్ గ్రామ సమీపంలో జాతీయ రహదారి 34పై ట్రక్కులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. మంటలు గమనించిన డ్రైవర్, క్లీనర్ అప్రమత్తమై లారీలోంచి దిగిపోయి తమ ప్రాణాలను కాపాడుకున్నారు. ఈ ఘటనలో మంటలు భారీగా చెలరేగి ట్రక్కు కాలి బూడిదైంది. ప్రమాదానికి గల కారణాలను పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa