బాపట్ల జిల్లాలో తమ పార్టీని బలోపేతం చేస్తున్నట్లు, పర్చూరు నియోజకవర్గం లో రానున్న ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థి పోటీలో ఉంటారని నవతరం పార్టీ జాతీయ అధ్యక్షుడు రావు సుబ్రహ్మణ్యం ప్రకటించారు. మార్టూరు పట్టణంలో శుక్రవారం నిర్వహించిన పార్టీ సమావేశానికి జిల్లా అధ్యక్షుడు నలమాల తిరుపతిరావు అధ్యక్షత వహించారు. ఈ సభలో రావు సుబ్రహ్మణ్యం పాల్గొని పరుచూరు నియోజకవర్గ పరిధిలో పార్టీ మండల కమిటీలను ఎంపిక చేసి నియామక పత్రాలు అందజేశారు. పార్టీని పటిష్ట పరచడానికి కృషి చేయాలని వారికి ఉద్భోదించారు. తమపై నమ్మకం తో బాధ్యతలు ఇచ్చిన నవతరంపార్టీ అధ్యక్షునికి వారు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్టూరు మండల అధ్యక్షుడు చెరుకూరిసుబ్బారావు, ఉపాధ్యక్షుడు మల్లెల శ్రీకాంత్, డేగరమూడి గ్రామ అధ్యక్షుడు ఆమటి పుల్లారావు, రాజుపాలెం గ్రామ అధ్యక్షుడు జానపాటి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.