ఆస్ట్రేలియా ఎంపీల బృందం ఆంధ్రప్రదేశ్ లో పర్యటించింది. ఆస్ట్రేలియా ఎంపీలు ఇవాళ తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్ను కలిశారు. విద్య, నైపుణ్యాభివృద్ధి, ఇంధన రంగాల్లో రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను వారు అభినందించారు. సీఎం జగన్తో పలు అంశాలపై చర్చించారు. ఏపీలో పరిస్థితి, ప్రభుత్వ విధానాలను అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా ఆస్ట్రేలియా ఎంపీలు మాట్లాడుతూ ఏపీ సీఎం జగన్ను కలవడం ఆనందంగా ఉందని, పరస్పర ఆలోచనలు, లక్ష్యాలపై చర్చించుకున్నామని ఆయన వెల్లడించారు.