ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ సోమవారం కియోంజర్ జిల్లాలో రూ.4,703 కోట్ల విలువైన 259 అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ప్రసంగిస్తూ.. జిల్లాలో 14,372 మిషన్ శక్తి గ్రూపుల ద్వారా 1.60 లక్షల మంది మహిళలు స్వావలంబన సాధించారని, వారి కోసం ప్రభుత్వం రూ.378 కోట్ల వడ్డీలేని రుణం అందించిందన్నారు. రైతులు, మహిళలు, యువత మన రాష్ట్రానికి త్రిమూర్తులని, మన రాష్ట్ర ప్రగతికి వీరే నాయకులు అని, అభివృద్ధి చెందిన ఒడిశా కలను సాకారం చేయడంలో వాళ్ళు కీలక పాత్ర పోషిస్తారని సీఎం అన్నారు. రూ.207.80 కోట్ల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయగా, 1378.40 కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు.