బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కు చేదు అనుభవం ఎదురైంది. ఔరంగాబాద్‌లో ప్రభుత్వ భవనాన్ని ప్రారంభించేందుకు వెళ్లిన ఆయనపై గుర్తు తెలియని వ్యక్తి కుర్చీ విసిరాడు.ముఖ్యమంత్రి దగ్గర కుర్చీ పడింది. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది నితీష్ ను చేతులతో అడ్డుకుని దాడి చేయకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.