ఎస్సీ సబ్ ప్లాన్ నిధులను దారి మళ్లించడంతో పాటు ఎస్సీలకు అమలు చేసిన సంక్షేమ పథకాలన్నింటినీ వైసీపీ ప్రభుత్వం చేయ డాన్ని నిరసిస్తూ బీజేపీ ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో అమలాపురం కలెక్టరేట్ ఎదుట సోమవారం 24గంటల నిరాహార దీక్షచేపట్టారు. ముఖ్యఅతిథిగా హాజరైన బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మానేపల్లి అయ్యాజీ వేమా మాట్లాడుతూ..... వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పటికే అమ లులో ఉన్న 26ఎస్సీ సంక్షేమ పథకాలను రద్దుచేశారని, వాటిని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు.బీజేపీ జిల్లా అధ్యక్షుడు కర్రి చిట్టిబాబు, ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షుడు పలివెలరాజు ఆధ్వర్యంలో చేపట్టిన దీక్షలో నాయకులు చీకురుమిల్లి వెంకటేశ్వరరావు, దూరి రాజేష్, కొల్లి సూర్యారావు, దాకే వెంకట్రావు, చరియన్, ఆకుమర్తి కోకిల, జంగా రాజేంద్రకుమార్, మోకా ప్రసాదరావు, తోట బాలకృష్ణ పాల్గొనగా పలువురు సంఘీభావం తెలిపారు.