భార్య కాపురానికి రాలేదని వ్యక్తి ఉరివేసుకుని మృతిచెందిన సంఘటన లేపాక్షి మండలం కంచిసముద్రం గ్రామంలో చోటు చేసుకుంది. గామ్రస్థులు తెలిపిన వివరాల మేరకు కంచిసముద్రం గ్రామానికి చెందిన తిరుమలేష్ కుమార్తె గంగరత్నమ్మను పరిగి మండలం ముళ్లమోతుకపల్లి గ్రామానికి చెందిన ఈరన్న(45)తో 20ఏళ్ల క్రితం వివాహమైంది. తాగుడుకు బానిసైన ఈరన్నను వదిలేసి భార్య పుట్టింటికి వచ్చేసింది. గత కొన్ని సంవత్సరాల నుంచి భార్యవద్దే ఈరన్న మామ ఇంటిలోనే ఉండేవాడు. భార్య భర్తలు తరచూ గొడవపడేవారని గ్రామస్థులు తెలిపారు. దీంతో మనస్థాపానికి గురై ఇంటిపక్కనే ఉన్న మల్బరీ షెడ్డులో ఉరివేసుకుని మృతిచెందాడు. మృతునికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.