సోషల్ మీడియా పోస్టుల వ్యవహారంలో ఐటీడీపీ చీఫ్ చింతకాయల విజయ్ ను ఏపీ సీఐడీ అధికారులు సుధీర్ఘ సమయం ప్రశ్నించారు. గురువారంనాడు కూడా సీఐడీ అధికార్ల విచారణ కొనసాగింది. ఈ విచారణ కొద్దిసేపటి కిందట ముగిసింది. విజయ్ ని ఏడు గంటల పాటు ప్రశ్నించారు. విచారణ అనంతరం చింతకాయల విజయ్ మాట్లాడుతూ, రెండోసారి కూడా విచారణకు వెళ్లానని తెలిపారు. సీఐడీ అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానాలు చెప్పానని వివరించారు. గత విచారణలో చంద్రబాబు, లోకేశ్ అంశాలు ఎక్కువగా అడిగారని విజయ్ వెల్లడించారు. ఇవాళ కేసుకు సంబంధించిన ప్రశ్నలు మాత్రమే అడిగారని తెలిపారు.