కడప జిల్లా సిద్ధపటం మండలంలోని భాకరాపేట లో వెలసిన శ్రీ జగద్గురువు వెంకట రాజయ్య పుల్లయ్య స్వామి వారిని గురువారం రాజంపేట శాసనసభ్యులు మేడా మల్లికార్జున రెడ్డి దర్శించుకున్నారు. ఆయన 27వ ఆరాధన మహోత్సవాల కార్యక్రమంలో పాల్గొని స్వామి వారికి పూజలు నిర్వహించారు. తీర్థప్రసాదాలు అందుకున్నారు. వీరి వెంట సిద్ధపటం మండలం వైకాపా నాయకులు ఉన్నారు.