కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని రైతులకు బీజేపీ సర్కారు శుభవార్త చెప్పింది. సున్నా వడ్డీ రుణ పరిమితిని వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచుతున్నట్లు సీఎం బసవరాజ్ బొమ్మై ప్రకటించారు. రాష్ట్ర అసెంబ్లీలో 2023-24 బడ్జెట్ సమర్పణ సమయంలో బొమ్మై ప్రకటన చేశారు. దీంతో పాటు రైతులకు మరిన్ని ఆఫర్లు ప్రకటించారు. కాగా ఈ ఏడాది ఏప్రిల్- మేలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.