ఆర్థికమాంద్య భయాలతో ప్రపంచవ్యాప్తంగా అనేక టెక్ కంపెనీలు ఉద్యోగులను తొలగిస్తున్న క్రమంలో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) మాత్రం తమ కంపెనీలో లేఆఫ్‌లు ఉండవని స్పష్టం చేసింది. జాబ్ కోల్పోయిన ప్రతిభావంతులైన స్టార్టప్ ఉద్యోగులను నియమించుకోవాలని చూస్తున్నట్లు చీఫ్ హెచ్ఆర్ ఆఫీసర్ మిలింద్ లక్కడ్ వెల్లడించారు. TCS ఒక్కసారి ఉద్యోగులను నియమించుకుంటే వారిని తొలగించే అవకాశం ఉండదని చెప్పారు