తమిళనాడులోని చెన్నైలో ఓ వింత వ్యవహారం వెలుగులోకి వచ్చింది. కుమార స్వామి అనే కాలేజీ లెక్చరర్ తనకంటే 20 ఏళ్లు చిన్నదైన భార్యను చంపడానికి బిచ్చగాడి వేషం ఎత్తాడు. భార్యపై అనుమానంతో నిత్యం వేధించే అతను భార్య రోడ్డుపై వెళ్తుండగా అక్కడే కాపుకాసి బ్లేడుతో ఒక్కసారిగా దాడి చేశాడు. మెడ, ముఖంపై గాయాలు చేయటంతో ఆమె అక్కడి నుంచి పారిపోయింది. దాడి చేసింది తన భర్తే అని గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేసింది.