మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని తంబళ్లపల్లె మల్లయ్య కొండలలో భక్తుల రద్దీ తగ్గడం లేదు. సోమవారం చుట్టు ప్రక్కల సుదూర ప్రాంతాల నుండి కాకుండా కర్ణాటక రాష్ట్రం నుండి పెద్దఎత్తున భక్తులు విచ్చేసారు. కాలినడకన మల్లయ్య కొండ చేరుకొని శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు, అర్చనలు, అభిషేకాలు నిర్వహించారు. భక్తులకు ఎలాంటి ఆసౌకర్యాలు లేకుండా ఆలయ సిబ్బంది దర్శన భాగ్యం కల్పించారు.