బీజేపీని వీడిన కన్నాలక్ష్మీనారాయణ తాను ఈనెల 23న చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరుతున్నానని చెప్పారు. దాదాపు 2 వేల మంది కార్యకర్తలు, అనుచరులతో కలిసి టీడీపీలో చేరతానన్నారు. మరికొందరు నాయకులు కూడా తనతో పాటు టీడీపీలో చేరతారని కన్నా చెప్పారు. ఈ క్రమంలోనే ఏపీలో అరాచక పాలన కొనసాగుతోందని విమర్శించారు. జగన్ ఫ్యాక్షన్ సంస్కృతిని పెంచి పోషిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ పూర్తిగా దిగజారిపోయిందన్నారు.