దేశ రాజధానిలోని మోడల్ టౌన్ ప్రాంతంలోని బ్యాంకులో చోరీకి ప్రయత్నించిన సాయుధ దొంగను ఢిల్లీ పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు.న పోలీసు అధికారులు తెలిపిన వివరాల ప్రకారం నిందితుడు బ్యాంకులోకి ప్రవేశించి క్యాష్ కౌంటర్ వద్దకు వెళ్లి నగదు ఇవ్వాలని బ్యాంకు ఉద్యోగిని కోరాడు. ఉద్యోగి చెక్కుబుక్ కోసం అడగడంతో బ్యాగ్‌లో వెతకడం ప్రారంభించి బ్యాగ్‌లోని పిస్టల్‌ను బయటకు తీశాడు. అతని వద్ద నుంచి 2 మ్యాగజైన్‌లు, 7 లైవ్ కాట్రిడ్జ్‌లు, 5 ఖాళీ కాట్రిడ్జ్‌లతో పాటు ఒక సెమీ ఆటోమేటిక్ పిస్టల్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దోపిడీకి పాల్పడే క్రమంలో నిందితులు బ్యాంకు పైకప్పుపై 5 రౌండ్లు కాల్పులు జరిపినట్లు వెల్లడైంది.దీనికి సంబంధించి చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నట్లు ఢిల్లీ పోలీసు అధికారులు తెలిపారు.