ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌లో కాంగ్రెస్ నేతలు ఈడీ కార్యాలయం ఎదుట నిరసనకు దిగారు. ఎనిమిది మందికి పైగా కాంగ్రెస్ నేతల ఇళ్లపై దాడులు చేయడాన్ని నిరసిస్తూ మంగళవారం రాయ్‌పూర్‌లోని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కార్యాలయం ఎదుట కాంగ్రెస్ నేతలు, పార్టీ కార్యకర్తలు భారీ నిరసన చేపట్టారు.భారతీయ జనతా పార్టీ ఆదేశానుసారం దాడులు జరుగుతున్నాయని, రాష్ట్ర కాంగ్రెస్ నేతలను వేధించడమే లక్ష్యంగా దాడులు జరుగుతున్నాయని కాంగ్రెస్ ఆరోపించింది. దాదాపు 5 వేల మంది నాయకులు, కార్యకర్తలు ఇడి కార్యాలయం ఎదుట గుమిగూడి బిజెపికి, ఏజెన్సీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.