అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ రష్యా-ఉక్రెయిన్ యుద్ధంపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఉక్రెయిన్ పై రష్యా ఎప్పటికీ విజయం సాధించలేదన్నారు. పాశ్చాత్య దేశాల మద్దతు ఉక్రెయిన్ కు ఎప్పుడూ ఉంటుందని బైడెన్ హామీ ఇచ్చారు. ఉక్రెయిన్ ఇంకా బలంగా ఉందన్నారు. ఉక్రెయిన్ పర్యటనకు వచ్చిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ రష్యా దాడి వల్ల ఉక్రెయిన్ ఒక్కటే కాదు ప్రపంచం మొత్తం సమస్యను ఎదుర్కొందని వ్యాఖ్యానించారు.