మనుషుల కన్నా మూగ జీవులకే విశ్వాసం, కృతజ్ఞత భావాలు ఎక్కువగా ఉంటాయంటారు. ఉత్తరప్రదేశ్లోని అమేథీలో ఇలాంటి ఓ ఘటన చోటుచేసుకుంది. ఏడాది కిందట మహమ్మద్ ఆరిఫ్ అనే వ్యక్తి పొలంలో ఓ కొంగ గాయపడి పడిపోయి ఉండటాన్ని గమనించి దానికి చికిత్స చేసి ఆహారం అందించాడు. అప్పటి నుంచి ఆ కొంగ ఆరిఫ్ వెంటే తిరుగుతూ, అతను ఎక్కడి వెళితే అక్కడి వరకూ తోడుగా వెళ్తుంది. దీనికి సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.