కొబ్బరి నూనె జుట్టుకి ఎంత మంచిదో తెలుసు. అలానే కొబ్బరి పాలు కూడా జుట్టు ఆరోగ్యానికి మేలు చేస్తుంది. బాగా డ్రై అయిన జుట్టుకి కొబ్బరి పాలను వారానికి ఓసారి అప్లై చేయడం వల్ల జుట్టులోని తేమ అలానే ఉండి.. జుట్టు షైనీగా కనిపించేలా చేస్తుంది. ఇందుకోసం
ఓ కప్పు కొబ్బరిపాలని తీసుకోండి. మీ జుట్టు పొడుగ్గా ఎక్కువగా ఉంటే ఇంకా ఎక్కువగానే తీసుకోండి. ఇప్పుడు జుట్టు కుదుళ్ళ నుంచి మీ కొబ్బరి పాలని మసాజ్ చేస్తూ రాయండి. మొత్తం రాశాక కాసేపు మసాజ్ చేసి గోరువెచ్చని టవల్ చుట్టి 15 నుంచి 20 నిమిషాలు తర్వాత క్లీన్ చేసుకోండి. అయితే తలస్నానం చేశాకే ఇది చేయాలి. దుమ్ము ఉన్న తలపై పెడితే చాలా సమస్యలు వస్తాయి.