తెలుగుదేశం పార్టీలో చేరిన మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణపై మంత్రి అంబటి రాంబాబు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంపై బురదజల్లేందుకు ప్రయత్నిస్తోందని మంత్రి అంబటి రాంబాబు అన్నారు. గురువారం ఆయన మాట్లాడుతూ.. వైసీపీ అధికార దుర్వినియోగం చేయలేదన్నారు. తిన్నింటి వాసాలు లెక్కపెట్టడంలో కన్నా లక్ష్మీనారాయణే గొప్ప అని రాంబాబు దుయ్యబట్టారు. రాజకీయ మనుగడ కోసం చంద్రబాబు కళ్ల వద్దకు చేరారని మంత్రి ఘాటు వ్యాఖ్యలు చేశారు. తెలుగుదేశంలో చేరి నైతిక విలువలు కోల్పోయారని.. ఇక్కడ ఎవరూ ఆయన గురించి ఆలోచించడం లేదని మంత్రి అన్నారు. నోటికొచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదని అంబటి రాంబాబు హెచ్చరించారు.