ఫిబ్రవరి న మిషన్ ఫర్ విజన్, సాయి మాతా సేవా ట్రస్టు, శంకర్ నేత్రాలయ చెన్నై మరియు జిల్లా అంధత్వ నివారణ సంస్థ ల సంయుక్త ఆధ్వర్యంలో మదనపల్లి జిల్లా పరిషత్ హైస్కూల్ (జడ్పీ హైస్కూల్) నందు ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించబడునని నిర్వాహకులు చిన్ని తెలిపారు. దీనిపై మదనపల్లి లో శుక్రవారం ఆయన మాట్లాడుతూ కంటికి సంబంధించిన అన్ని రకముల వ్యాధులకు వచ్చి తమ సమస్యలను పరీక్షించుకోవలసినదిగా అయన కోరారు. ప్రతినెలా ఈ శిబిరము నాల్గవ ఆదివారం కొనసాగు తుందని వివరించారు. స్థానిక ఆర్టీసీ బస్టాండ్ పక్కన గల జడ్పీ హైస్కూల్ మదనపల్లె లో జరిగే ఉచిత కంటి చికిత్స శిబిరం ఉదయం 9 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 1 గంట వరకు జరుగుతుందని అవసరమైన వారు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఇతర వివరాలకు చిన్ని9440078976 నెంబర్ కు సంప్రదించాలన్నారు.