టర్కీ, సిరియాల్లో ఈ నెల 6న బలమైన భూకంపం సంభవించిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో మృతిచెందిన వారి సంఖ్య 50 వేలు దాటింది. టర్కీలో 44,218 మంది మరణించారని, సిరియాలో 5,914 మంది చనిపోయారని స్థానిక ప్రభుత్వాలు తెలిపాయి. భూకంప ప్రభావిత ప్రాంతాల్లో 1.60 లక్షల భవనాలు, 5.20 లక్షల అపార్టుమెంట్లు దెబ్బతిన్నాయి. భూకంప ప్రభావిత ప్రాంతాల్లో 15 లక్షల మంది నిరాశ్రయులు అయ్యారు.