యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ భద్రతా సిబ్బందిలో ఒకరు అనూహ్యంగా మృతి చెందారు. హెడ్ కానిస్టేబుల్ గా పని చేస్తున్న సందీప్ యాదవ్ తన తుపాకీని శుభ్రం చేస్తుండగా ప్రమాదవశాత్తూ పేలి ప్రాణాలు కోల్పోయారు. శుక్రవారం జరిగిన ఈ ఘటనలో తూటా ఆయన తలలోకి దూసుకెళ్లింది. ఆయన అక్కడికక్కడే మరణించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. కాగా సందీప్ శనివారం యోగికి భద్రత కల్పించే విధుల్లో చేరాల్సి ఉంది.