ఈపీఎఫ్ పరిధిలోకి వచ్చే ఉద్యోగులు, కార్మికులు, పింఛనుదారులు అధిక పింఛను పొందేందుకు యజమానితో కలిసి ఉమ్మడి ఆప్షన్ ఇచ్చేందుకు ఈపీఎఫ్వో ఆన్లైన్లో దరఖాస్తును అందుబాటులోకి తెచ్చింది. 2014 సెప్టెంబర్ 1కి ముందు ఈపీఎఫ్ఓ చందాదారులుగా చేరి, సర్వీసులో కొనసాగుతూ అధిక వేతనంపై చందా చెల్లిస్తూ, ఉమ్మడి ఆప్షన్ ఇవ్వలేక పోయినవారు దరఖాస్తు చేసేందుకు అర్హులు. యజమానితో కలిసి మే3వ తేదీలోగా ఉమ్మడి ఆప్షన్ ఇవ్వాలి.