రాత్రిపూట కొన్ని ఆహారాలను తింటే మీరు ఇట్టే బరువు పెరిగిపోతారు. రాత్రిపూట ఎక్కువగా వేయించిన ఆహారాలను తినకూడదు. వీటితో పాటు జున్ను, రెడ్ మీట్, బర్గర్లు, పిజ్జాలకు దూరంగా ఉండాలి. నూనె, మసాలాలు ఎక్కువగా ఉండే ఆహారాలు ఎన్నో అనారోగ్య సమస్యలకు దారితీస్తాయి. శెనగపిండి, రాజ్మా, శెనగలు, కాలీఫ్లవర్, క్యాబేజీలతో చేసిన వంటకాలను రాత్రి పడుకునే ముందు తింటే అవి జీర్ణం కావడానికి చాలా సమయం పడుతుంది.