ఇప్పటికే భారీ సంఖ్యలో ఉద్యోగులను తొలగించిన ట్విటర్ సంస్థ మరో సారి ఉద్యోగులకు షాక్ ఇచ్చింది. ట్విట్టర్ ఈసారి మరో 200 మంది ఉద్యోగులను తొలగించినట్లు తెలిసింది. ఇందులో ప్రోడక్ట్ మేనేజర్లు, డేటా సైంటిస్టులు, ఇంజినీర్లు ఉన్నట్లు సమాచారం. కంపెనీ ఈ తొలగింపులు గురించి అధికారిక సమాచారం వెల్లడించలేదు. కాగా గత ఏడాది నవంబర్ నెలలో ఏకంగా 3,700 మంది ఉద్యోగులను తొలగించిన విషయం తెలిసిందే.