శ్రీ సత్య సాయి జిల్లా మడకశిర నియోజకవర్గం రొళ్ళ మండలంలోని అనుపనపల్లి జెడ్పీహెచ్ఎస్ లో బుధవారం డీఈఓ మీనాక్షి ఆకస్మికంగా తనిఖీ చేశారు. నాడు నేడు పనులపై ఇంజనీర్లు, అసిస్టెంట్ ఇంజనీర్లతో వివరాలు అడిగి తెలుసుకున్నారు. పనుల్లో నాణ్యత ఉండాలంటూ సూచించారు. త్వరగా పనులు పూర్తీచేయాలని వారిని ఆదేశించారు. విద్యార్థులు పాఠాలు, మధ్యాహ్న భోజనం తతదితర విషయాలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎంలు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.