వరుసగా ఏడు రోజులు నష్టాల్లో కొనసాగిన సూచీలు మంగళవారం ఫ్లాట్గా ఆరంభమైనా ఆ తర్వాత లాభాల్లోకి వెళ్లాయి. ఉదయం సెన్సెక్స్ 76 పాయింట్లు లాభపడి 59,364 వద్ద.. నిఫ్టీ10 పాయింట్ల లాభంతో 17,402 వద్ద కొనసాగుతున్నాయి. డాలర్ విలువ 23పైసలు నష్టంతో 82.93 వద్ద ట్రేడవుతోంది. ఎంఅండ్ఎం, బజాజ్ ఆటో, ఐషర్ మోటార్స్, హీరో మోటోకార్ప్,లార్సెన్ షేర్లు లాభాల్లో ఉన్నాయి.