పాలు ఆరోగ్యమే కానీ వాటిలో కలిపి తీసుకునే పదార్థాల విషయంలోనే జాగ్రత్త అవసరమని నిపుణులు సూచిస్తున్నారు. పాలతో ద్రాక్ష, నిమ్మ, ఆరెంజ్ వంటి పండ్లను తీసుకోకూడదు. ఇలాచేస్తే కడుపు నొప్పి రావొచ్చు. పనస, కాకరకాయల్ని కూడా పాలతో కలిపి తినకూడదు. దీనివల్ల దురద, సోరియాసిస్ వంటి సమస్య ఎదురవుతుంది. ఆయుర్వేదం ప్రకారం, అరటిపండ్లు, పాలు శరీరంలో టాక్సిన్ ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది. అలాగే నిద్రపై ప్రభావం చూపుతుంది.