గుంటూరు: ఆస్తి పన్ను వసూలులో వెనుకబాటు, కేటాయించిన విధుల్లో నిర్లక్ష్యంగా ఉన్న ముగ్గురు సచివాలయ అడ్మిన్ కార్యదర్శులను విధుల నుండి సస్పెండ్ చేస్తూ గుంటూరు కమిషనర్ కీర్తి చేకూరి సోమవారం ఆదేశాలు జారీ చేశారు. మరో ముగ్గురు అడ్మిన్ కార్యదర్శులు, రెవెన్యూ ఇన్స్పెక్టర్ కు షోకాజు నోటీసులు జారీ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. వీధుల్లో నిర్లక్ష్యంగా ఉండే వారిపై కఠిన చర్యలు తప్పవని కమిషనర్ కీర్తి చేకూరి హెచ్చరించారు.