వచ్చే ఎన్నికల్లో వైయస్ఆర్సీపీ ఘనమైన మెజార్టీతో విజయం పొందేందుకు కార్యకర్తలు కంకణబద్ధులు కావాలని ఉమ్మడి విశాఖ జిల్లాలో వైయస్ఆర్సీపీ రీజనల్ కోఆర్డినేటర్, తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ వై వి సుబ్బారెడ్డి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గానికి జరుగుతున్న ఎన్నికల్లో వైయస్ఆర్సీపీ అభ్యర్థిగా పోటీలో ఉన్న సీతంరాజు సుధాకర్ కు మద్దతుగా అనకాపల్లి నియోజకవర్గంలో పార్టీ కార్యకర్తలు, సచివాలయ కన్వీనర్లు, గృహ సారధులతో స్థానిక పెంటకోట కళ్యాణ మండపంలో సోమవారం ఏర్పాటు చేసిన పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు.